శర్వానంద్.. రెడ్ లైట్ ఏరియా?

Saturday, June 9th, 2018, 01:02:45 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న వారిలో శర్వానంద్ ఒకరు. తన ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్తధనం ఉండేలా చూసుకోవడం శర్వాకు అలవాటే. ఇక ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి కథానాయిక. ఈ సినిమా తరువాత మావో వినూత్న కథకు ఈ యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

స్వామి రారా – కేశవ సినిమాలతో నిఖిల్ కెరీర్ కు మంచి హిట్స్ ఇచ్చిన సుదీర్ వర్మ తో శర్వా ఒక ప్రాజెక్ట్ ను లాక్ చేసుకున్నాడు. ఆ సినిమాకు రెడ్ లైట్ ఏరియా అనే టైటిల్ ను సెట్ చేసుకున్నట్లు సమాచారం. దాదాపు స్క్రిప్ట్ పనులు ఎండ్ అయ్యాయి. ఇక శర్వా వస్తే సినిమా స్టార్ట్ అవుతుందట. అఖిల్ తో హలో సినిమాలో కనిపించిన కళ్యాణి ప్రియదర్శన్ ని కూడా హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక మరొక హీరోయిన్ గా కాజల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments