తెలంగాణ లో ఇంటర్ పరీక్షలు రద్దు

Wednesday, June 9th, 2021, 12:26:35 PM IST

తెలంగాణ రాష్ట్రం లో ఇంటర్ పరీక్షలు రద్దు అయ్యాయి. అయితే ఇప్పటికే ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రెండవ సంవత్సర పరీక్షలను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే నేడు సాయంత్రం దీని పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంటర్ పరీక్షలు రద్దు పై నిన్న కేబినెట్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు పూర్తి స్థాయిలో చర్చ జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సరైన నిర్ణయం కాదని అధికారులు కేబినెట్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే పరీక్షల రద్దు మరియు ఫలితాల కి సంబందించిన ప్రకటన నేడు సాయంత్రం వరకు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.