బిగ్ న్యూస్ : జగన్ కు తలనొప్పిగా మారుతున్న అంతర్గత చీలికలు!

Thursday, February 6th, 2020, 10:33:02 AM IST

ఏ రాజకీయ పార్ట్ అయినా సరే అది ఎంత పెద్దది అయినా ఎలాంటి పవర్ ఫుల్ నేతలు దాన్ని హ్యాండిల్ చేసినా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అన్నది చాలా వరకు తెలియకపోవచ్చు కానీ అది మరీ శృతి మించి పార్టీకు సంబంధించిన కీలక నేతల నడుమే రచ్చలా మారితే ఒకే చోట ఒకే పార్టీలో రెండు వర్గాలు ఏర్పడతాయి.అలా ఇప్పుడు వైసీపీలో ఒక కీలక ప్రాంతంలో నెలకొన్న అంతర్గత చీలికలు ఇప్పుడు వైసీపీ మరియు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

కర్నూల్ జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు మరియు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్య ఇప్పటికే చిన్న పాటి కోల్డ్ వార్ జరుగుతుందన్న సంగతి అక్కడ రాజకీయ వర్గాలకు తెలుసు.కానీ ఇది ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది.అది ఎంత వరకు వెళ్లిందంటే ఒకరికి తెలీకుండా మరొకరి మనుషులను అదే పార్టీ నుంచి చేర్చుకోవడం వరకు వెళ్ళింది.ఒకే పార్టీలోని ఇద్దరి నేతలకు చెందిన కార్యకర్తలను చేర్చుకోవడం ఏమిటో అయితే అర్ధం కావడం లేదు కానీ వీరిద్దరి మధ్య ఇప్పుడు నెలకొన్న ఆధిపత్య పోరు ఎటు దారి తీస్తుందో అంటూ హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి.మరి ఇది ఇంకా జగన్ దగ్గరకు వెళ్లిందో లేదో తెలియాలి.