వైసీపీలో అంతర్గత కలహాలు – సొంత నేతపైనే ఫిర్యాదు…

Thursday, July 18th, 2019, 02:15:28 AM IST

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి… సొంత పార్టీలోని నేతలు ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా వారి ఆగడాలు మరీ ఎక్కువవుతున్నాయని మొరపెట్టుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో ఎంపిలు జోక్యం చేసుకుంటున్నారంటూ స్థానిక ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే బాపట్ల ఎంపి నందిగం సురేష్‌ తన నియోజకవర్గంలో అనవసరంగా కలుగజేసుకుంటున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పారు. కాగా ఏపీలో ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రిని కలిసి తన నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలను అన్నింటిని ఒక్కొక్కటిగా వివరించారు. అంతేకాకుండా తన నియోజకవర్గంలో ఎంపీ సురేష్ జోక్యం చేసుకోవడాన్ని నివారించాలని చెప్పారు.

దానికి తోడు ఇసుక తవ్వకాలను పరోక్షంగా నిర్వహించడం వలన తమకు చెడ్డ పేరు వస్తుందని ఆరోపించారు. అయితే వీరిరువురి మధ్యన జరిగిన గోడలని సరిగ్గా పరిష్కరించే బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారని, వారి సమస్యలను సరిగ్గా పరిష్కరించాలని జగన్ ఆదేశించారని సమాచారం. అంతేకాకుండా పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని జగన్ ఆదేశాలు కూడా జారీ చేశారని సమాచారం.