రివ్యూ రాజా తీన్‌మార్ : ఇంటెలిజెంట్ – ఇంటలిజెన్స్ చూపించలేకపోయాడు

Friday, February 9th, 2018, 05:48:06 PM IST

తెరపై కనిపించిన వారు : సాయి ధరమ్తేజ్, లావణ్య త్రిపాటి, నాజర్, సప్తగిరి

కెప్టెన్ ఆఫ్ ‘ఇంటెలిజెంట్ ‘ : వి.వి.వినాయక్

మూల కథ :

తేజ (సాయి ధరమ్ తేజ్) నంద కిశోర్ (నాజర్) ను గురువుగా భావిస్తుంటాడు. అతని కంపెనీలో సాఫ్ట్ వేర్ గా పని చేస్తూ ఉంటాడు తేజ. కొంత సమయానికి నందకిశోర్ కుమార్తె (లావణ్య త్రిపాటి) తేజ ప్రేమలో పడుతుంది. వీరిద్దరు సరదాగా గడుపుతున్న సమయంలో విక్కి భాయ్ (రాహుల్ దేవ్) వీరి జీవితంలోకి ప్రవేసిస్తాడు. నందకిశోర్ కంపెనీని తను సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. కొంతకాలం తరువాత నంద కిశోర్ ను చంపుతాడు విక్కి భాయ్. తన గురువును హతమార్చిన విక్కిపై తేజ ఎలా రివేంజ్ తీర్చుకున్నదనేది తెలియాలంటే ఇంటిలిజెంట్ చూడాల్సిందే.

విజిల్ పోడు :

డాన్స్, ఫైట్స్ లో సాయి ధరమ్ తేజ్ తన సత్తా చాటాడు. ముఖ్యంగా రీమిక్స్ పాటలో సాయి ఆకట్టుకున్నాడు. కాబట్టి మొదటి విజిల్ సాయి ధరమ్ తేజ్ కు వేయాలి

లావణ్య త్రిపాటి గ్లామర్ గా కనిపించింది. నాజర్ కూతురిగా, సాయి ధరమ్ తేజ్ గర్ల్ ఫ్రెండ్ గా మంచి నటన కనబరిచింది కాబట్టి కాబట్టి రెండో విజిల్ లావణ్య త్రిపాటికి వేయాలి

ఇంటర్వెల్ సన్నివేశం, సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ సీన్ బాగున్నాయి. సి.కళ్యాణ్ బాగా డబ్బు పెట్టి నిర్మించాడు కావున ఆయనకు మూడో విజిల్ వేయాలి.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

కథలో కొత్తదనం లేదు. కథనం కూడా ఆసక్తిగా లేదు. చాలా సన్నివేశాలు బోర్ గా ఉన్నాయి.

వినాయక్ లాంటి పెద్ద దర్శకుడు నుండి ఎవ్వరు ఇలాంటి సినిమాను ఆశించారు. పాటలు సినిమా కథకు అడ్డంకులుగా మారాయి.

సినిమా క్లైమాక్స్ గొప్పగా లేదు. హీరో చేసే పనులు ప్రేక్షకులకు అతిశయోక్తిని కలిగిస్తాయి. ఇంటిలిజెంట్ సినిమా నుండి ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో లేదు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

ఈ సినిమాలో చప్పట్లు కొట్టే సీన్స్ పెద్దగా లేవు

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : సినిమా మరీ ఇంత సిల్లీగా ఉంది.

మిస్టర్ బి : అవునా! హీరోఇజం సీన్స్, చమకు చమకు సాంగ్ పరువాలేదా?

మిస్టర్ ఏ : అవితప్ప సినిమాలో పెద్దగా విషయం లేదని నా ఫీలింగ్

మిస్టర్ బి : కరెక్ట్ కాని.. బ్రాహ్మి, సప్తగిరి కామెడి ఎలా ఉంది ?

మిస్టర్ ఏ : అది కూడా గొప్పగా లేదు

మిస్టర్ బి : మరి సినిమాకు వెళ్ళమంటావా ?

మిస్టర్ ఏ : నాకైతే గొప్పగా అనిపించలేదు, మరి నీ ఇష్టం