ఐఫోన్ 7 ప్లస్..తుస్ మని పేలింది..!

Friday, September 30th, 2016, 02:55:21 PM IST

iphone-blast
ఐటి దిగ్గజం ఆపిల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఐఫోన్ 7 కు మంచి గిరాకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం తెలిసిందే.దీని ప్రతిష్టను దిగజార్చే వార్త చక్కర్లు కొడుతోంది.ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ కలర్ మోడల్ పేలిపోయిందనే వార్త బయటకు వచ్చింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలుళ్ల సమస్యతో ఆ సంస్థ కు తీవ్రనష్టాన్ని మిగిల్చింది. ఈ ఫోన్ బ్యాటరీ లోపంతో పేలుళ్లు సంభవించగా, ఐఫోన్ పేలిపోవడానికి గల సరైన కారణాలు వెల్లడి కాలేదు.

ఐఫోన్ 7 ప్లస్ ను ఆర్డర్ చేసిన వినియోగ దారుడు బాక్స్ ని తెరచి చూడగా అందులో పేలిపోయిన ఐఫోన్ దర్శనం ఇవ్వడంతో కంగుతిన్నాడు.ఈ ఘటన పై ఆపిల్ సంస్థ ఇప్పటివరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.కానీ లోలోపల విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెట్ లో పేలిపోయిన ఐఫోన్ 7 ఫోటోలు దర్శనమిస్తున్నాయి.వినియోగ దారుడు రీప్లేస్ మెంట్ కోసల ఆపిల్ సంస్థని ఆశ్రయించాడు.