ఐఫోన్ 8 కొంటున్నారా జాగ్రత్త ?

Saturday, September 30th, 2017, 11:34:08 AM IST

మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీలో ఎంతో మార్పు వచ్చింది. ముఖ్యంగా మొబైల్ నెట్ వర్కింగ్ సంస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత రోజుల్లో మార్కెట్ లోకి రోజుకో కొత్త రకం ఫోన్ వచ్చేస్తోంది. స్మార్ట్ ఫోన్ లేనిదే ఎవ్వరు ఉండడం లేదు. అయితే కొన్ని ఫోన్ల తయారీ విధానం మానవుడికి చేదు అనుభవం ఎదురవుతోంది. రీసెంట్ గా ఫోన్ల విక్రయాల్లో రికార్డ్ సృష్టించిన ఎమ్ఐ సంస్థ రిలీజ్ చేసిన కొత్త ఫోన్లు పేలుతున్నాయని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఆ స్థ కొట్టి పారేసింది.

ఎవరో కావాలనే ఆ సంస్థపై ఆ విధంగా తప్పుడు ప్రచారాలను చేస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ అదే తరహాలో స్మార్ట్ ఫోన్లకు అగ్ర రాజైన ఐఫోన్ పై కూడా ఇలాంటి వార్తలే వస్తున్నాయి. ఆ సంస్థ రీసెంట్ గా రిలీజ్ చేసిన ఐఫోన్ 8 , 8 ప్లస్ లకు బ్యాటరీ పరమైన సమస్యలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. రెండు దేశాల్లో ఈ తరహా వార్తలు వెలువడ్డాయి. తైవాన్‌- జపాన్‌ దేశాల్లో రెండు ఫోన్లకు బ్యాటరీ పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో వినియోగదారులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇండియాలో ఈ ఫోన్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. తైవాన్ లో ఐ ఫోన్‌ 8 కి ఛార్జింగ్ పెట్టిన కొన్ని నిమిషాలకే బ్యాటరీ ఉబ్బిపోగా జపాన్ లో కూడా అదే స్థాయిలో ఒక వినియోగదారుడికి చేదు అనుభం ఎదురైనట్లు ఆ దేశ మీడియా ద్వారా తెలుస్తోంది.

Comments