నీళ్లలో అరగంట ముంచినా పర్లేదు..కనీ వినీ ఎరుగని ఫీచర్లతో ఐఫోన్ 8..!

Friday, February 10th, 2017, 08:40:59 PM IST


ఐఫోన్ 8 అందరికి స్వీట్ షాక్ ఇవ్వనుంది. యాపిల్ సంస్థ తదుపరి తీసుకుని రాబోయో ఐఫోన్ 8 లో అబ్బురపరిచే ఫీచర్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఐఫోన్ 8 లో ఉండబోయె ఫీచర్ల గురించి ఇప్పటికే లీకులు అందుతున్నాయి. ఐఫోన్ 8 లేదా ఐఫోన్ ఎక్స్ పేరుతో తదుపరి మోడల్ ని యాపిల్ సంస్థ విడుదల చేయనుంది. ఐఫోన్ 7 కంటే అత్యంత అధునాతన ఫీచర్స్ ఇందులో జతచేస్తోందని ప్రచారం జరుగుతోంది.

అరగంటపాటు నీళ్లల్లో ముంచినా సేఫ్ గా ఉండే టెక్నాలజీ, వైర్లెస్ ఛార్జర్ మొదలగు ఫీచర్స్ ఇందులో ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో 3 డి టచ్ మాడ్యూల్ ని కూడా జత చేయనున్నారట. ఓవర్ హీట్ నుంచి ఫోన్ ని కాపాడేందుకు అడిషనల్ గ్రాఫైట్ షీట్ ని జత చేయనున్నారు. బ్యాటరీ పేలుళ్లు ప్రమాదకరంగా మారిన నేపథ్యం లో వైర్లెస్ ఛార్జర్, గ్రాఫైట్ షీట్ టెక్నాలజీ ఉపయోగం కానుందని అంటున్నారు. లిక్విడ్ మెటల్ ఫ్రేమ్ తో 6. ఎం ఎం మందం, 5.8 అంగుళాల ఓ ఎల్ ఈడీ ఎడ్జ్ డిస్ ప్లే డిజైన్ తో ఐఫోన్ 8 రానుంది. వైర్లెస్ చార్జింగ్ ప్లేట్ ద్వారా 15 అడుగుల దూరం నుంచి కూడా చార్జ్ చేసుకోవచ్చని ఆన్లైన్ లో ప్రచారం జరుగుతోంది.స్మార్ట్ కనెక్టర్ డ్యూయల్ 12 మెగాపిక్సల్ యాంగిల్, టెలీ ఫోటో లెన్స్ 3 డి కెమెరా టెక్నాలజీ ని ఐఫోన్ 8 ద్వారా అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు తెలుస్తోంది.