ఐపీఎల్ 11 : పొట్టి క్రికెట్ పండగ ఈసారి ముందుగానే..!

Tuesday, January 23rd, 2018, 12:07:59 AM IST

ఈ సారి ఐపీఎల్ సీజన్ ప్రారంభ మరియు ముగింపు తేదీలు మరియు ఇతర వివరాలని చైర్మన్ రాజీవ్ శుక్ల ప్రకటించారు. ఈ పొట్టి ఫార్మాట్ క్రికెట్ పండగ ఏప్రిల్ 7 న ప్రారంభమైన మే 27 న ముగియనుంది. అంతేకాక ఈ సీజన్ లో ఆసక్తికరమైన మార్పు చోటు చేసుకుంది. ఎప్పుడూ ఐపీఎల్ మ్యాచ్ లు సాయంత్రం 4 గంటలకు లేదా 8 గంటలకు ప్రారంభం అయ్యేవి. కానీ ఈ సారి మాత్రం మ్యాచ్ లని గంట ముందుగానే అంటే 7 గంటలకే మ్యాచ్ లని ప్రారంభించనున్నారు.

ఐపీఎల్ 11 ప్రసార హక్కులని సొంతం చేసుకున్న స్టార్ ఇండియా సంస్థ మ్యాచ్ లని గంట ముందుగా నిర్వహించాలని కోరింది. ఈ ప్రతిపాదనకు ఐపీఎల్ మండలి ఆమోదం తెలిపిందని రాజీవ్ శుక్ల వివరించారు. ఈ సీజన్ లో నిషేధం ముగించుకుని చెన్నై మరియు రాజస్థాన్ జట్లు పునరాగమనం చేయబోతున్నాయి. ఈనెల 27, 28 తేదీల్లో ఐపీఎల్ 11 వేలం బెంగుళూరులో జరగనుంది. ఈ సీజన్ లో మొత్తం 578 మంది ఆటగాళ్లు వేలానికి రానున్నారు. వారిలో 369 మంది ఇండియన్ ఆటగాళ్లే కావడం విశేషం. ఏప్రిల్ 7 న ముంబై వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది.