స్పాట్ ఫిక్సింగ్ స్కాంలో అరెస్టయిన క్రికెటర్ అజిత్ చండిలా బెయిల్

Monday, September 9th, 2013, 07:28:25 PM IST

cricket

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కాంలో సస్పెండయిన క్రికెటర్ అజిత్ చండిలా, మాజీ రంజీ క్రీడాకారుడు బాబూ రామ్ యాదవ్, మరో బూకి దీపక్ లకు ఢిల్లీ కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. మే 16 న అరెస్టయిన వీరికి ఢిల్లీ కోర్టు 50 వేల వ్యక్తి గత పూచీకత్తు అలాగే మరో 50 వేల విలువైన ష్యూరీటి ఇవ్వాలని అదనపు సెషన్స్ జడ్జి ధర్మేష్ శర్మ ఆదేశించారు.ఇదే కేసులో అరెస్టయిన మరో ఐదుగురు బెయిల్ కోరగా వారిపై మోకా చట్టం కింద కేసులు ఉన్నందు వల్ల బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే ఈ కేసుకు సంబందించిన కొన్ని లింకులు అదృషమయ్యాయని వాటికి ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ సమాదానం ఇవ్వవలసి ఉంటుందని దీనిపై నెల రోజుల్లోగా పరిశీలించాలని ఆదేశించింది. వారి బెయిల్ ను రద్దు చేయాలనీ పోలీసులు కోరగా దీనిపై విచారణను కోర్టు అక్టోబర్ 7తేదికి వాయిదా వేసింది.