కేసీఆర్ మంత్రివర్గంలోకి రాబోతున్న ఐపీఎస్ అధికారి.. ఎవరో తెలుసా..!

Wednesday, February 5th, 2020, 07:58:19 PM IST

తెలంగాణ రాజకీయాలలోకి కొత్త వ్యక్తి అడుగుపెట్టబోతున్నారు. అయితే రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తూనే ఏకంగా మంత్రి స్థానంలో కూర్చోబోతున్నాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తమ మంత్రివర్గంలోకి ఒక ఐపీఎస్ అధికారిని తీసుకోబోతుంది.

అయితే కేరళ ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ పోలీస్ వింగ్ ఐజీ లక్ష్మణ్ తన పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. అంతేకాదు ఇకపై కేసీఆర్ మంత్రివర్గంలో పనిచేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ విషయం గురుంచి సీఎం కేసీఆర్ కేరళ సీఎం పినరయి విజయన్‌తో కూడా మాట్లాడినట్టు సమాచారం. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మణ్ కేరళలో ఏఎస్పీగా కెరిర్‌ని ప్రారంభించారు. అంతకు ముందు బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ CEO గా నాలుగు సంవత్సరాలు పనిచేశారు.