ప్రపంచ రాక్షసులు కి బుద్ధి రావట్లేదు

Monday, February 20th, 2017, 10:10:33 PM IST


ఇస్లామిక్ ఉగ్రవాదుల దూకుడు కి అడ్డూ అదుపూ ఉండేది కాదు. ఒక పక్క అంతర్జాతీయంగా ఆదాయ వనరులు తగ్గిస్తూ వస్తున్నా కూడా ఐ సిస్ తన మూర్ఖపు పంథా వీడక పోగా అంతకంతకూ స్ట్రాంగ్ ఐపోతోంది అంటోంది ఒక అంతర్జాతీయ సంస్థ. 2014 ఐఎస్ ఆదాయం 1.9 బిలియన్ డాలర్ లు గా ఉన్న తరవాత 2016లో 870 మిలియన్ డాలర్లకు పడిపోయింది. 2014లో ఐఎస్ ఆధీనంలో ఇరాక్ – సిరియాలోని కొన్ని ప్రాంతాలు ఉండేవి. దీంతో వీళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగింది. ఇరాక్ – సిరియాలలో ముడి చమురు నిల్వలు ఎక్కువగా ఉండటంతో వ్యాపారులను బెదిరించి మామూళ్లు వసూలు చేసేవారు. లూటీలకు పాల్పడేవారు. ఇలా పలు మార్గాల ద్వారా ఐఎస్ ఉగ్రవాదులు తమ ఆదాయవనరులను పెంచుకున్నారు. తర్వాతకాలంలో ఐఎస్ ఉగ్రవాదులను ఏరిపారేయడానికి ఇరాక్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది. వారి చేతుల్లో ఉన్న భూభాగంలో దాదాపు 62శాతం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.