రైలు పట్టాలపై అడ్డంగా మరో పట్టా.. డ్రైవర్ అలా చేసి ఉండకపోతే..!

Thursday, January 26th, 2017, 04:24:25 PM IST

train-track
మడ్గావ్ నుంచి దాదార్ వెళుతున్న జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ఉండకపోతే రిపబ్లిక్ డే రోజు మరో ఘోర రైలు ప్రమాదం గురించి మనం చర్చించుకోవలసి వచ్చేది. రైలు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఘోర ప్రమాదం తప్పింది.గుర్తు తెలియని దుండగులు కొందరు రైలు పట్టాల పై అడ్డంగా మరో రైలు పట్టాని పెట్టారు. రైలు ప్రమాదం సంభవించేలా కుట్రపన్ని ఈ దారుణ చర్యకు ఒడి కట్టారు. ముంబై సమీపం లో ఈ ఘటన జరిగింది.

రైలుప్రమాదం జరిగేలా ఉందని గుర్తించిన డ్రైవర్ అత్యవసర బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. కొంతమంది సహాయకుల ద్వారా దానిని పక్కకు తీసి పడేసి రైలు ను 15 నిమిషాల ఆలస్యంగా నడిపించాడు. 15 మీటర్లు పొడవు ఉన్న పట్టాని దుండగులు రైలు పట్టాలపై అడ్డంగా ఉంచారు. రైల్వే శాఖ దీనిపై అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. రిపబ్లిక్ డే సందర్భంగా దేశంలో అలజడి సృష్టించాలని దుండగులు ఈ కుట్రకు పాల్పడి ఉంటారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.