వ్యూహంలోంచి బ‌య‌ట‌ప‌డ్డ `అభిమ‌న్యుడు`?

Friday, April 27th, 2018, 09:38:31 PM IST

ఇటీవ‌ల‌ కోలీవుడ్‌లో నెల‌కొన్న అసాధార‌ణ స‌న్నివేశం 1000 కోట్ల బిజినెస్‌ని దెబ్బ కొట్టింద‌న్న స‌మాచారం ఉంది. థియేట‌ర్ల బంద్ స‌హా ప‌లు విష‌యాల‌పై 48రోజులుగా సాగించిన బంద్ ఈ దెబ్బ కొట్టింది. ఇప్ప‌టివ‌ర‌కూ రివ్యూ క‌మిటీలు ప‌లు స‌మ‌స్య‌ల‌పై తీవ్రంగా ప‌రిష్కార మార్గం వెత‌క‌డంతో ఓపెనింగులు, రిలీజ్‌ల విష‌యంలో క్లారిటీ మిస్స‌య్యింది. ఇప్ప‌టికే భారీ చిత్రం `కాలా` రిలీజ్‌కి క్లియ‌రెన్స్ ఇచ్చారు. ల్యాబుల్లో పెండింగుల్లో ఉన్న వాటికి ప‌నులు ప్రారంభ‌మ‌య్యేందుకు మార్గం సుగ‌మం చేశారు.

తాజాగా టీఎఫ్‌సీసీ అధ్య‌క్షుడు, నిర్మాత విశాల్ తెర‌కెక్కించిన ద్విభాషా చిత్రం `అభిమ‌న్యుడు`కి లైన్ క్లియ‌ర్ అయ్యింది. ఈ చిత్రం త‌మిళంలో `ఇరుంబు తిరై` మే 11న రిలీజ్ కానుంది. సేమ్ డే తెలుగులోనూ `అభిమాన్యుడు` పేరుతో రిలీజ‌వుతోంది. ఆ మేర‌కు విశాల్‌కి రివ్యూ క‌మిటీ నుంచి అప్రూవ‌ల్ వ‌చ్చింది. విశాల్‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థతో క‌లిసి విశాల్ నిర్మించాడు. జార్జి సినిమాటోగ్ర‌ఫీ అందించారు. త్వ‌ర‌లోనే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments