వీడియో : గురు శిష్యుల మ‌ధ్య వార్‌

Sunday, May 6th, 2018, 11:44:07 AM IST

యాక్ష‌న్ కింగ్ అర్జున్ స‌ల‌హా మేర‌కు ద‌ర్శ‌క‌నిర్మాత విక్ర‌మ్ కృష్ణ త‌న‌ త‌మ్ముడు విశాల్‌ని హీరోని చేశాడు. అర్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఓ చిత్రానికి అసిస్టెంట్‌గా ప‌ని చేసిన విశాల్ అటుపై `పందెం కోడి` చిత్రంతో హీరో అవ్వ‌డం వెన‌క అర్జున్ ప్రోద్భ‌లం ఎంతో ఉంది. ఇప్పుడు విశాల్ స్టాట‌స్ ఏంటో అంద‌రికీ తెలుసు. అత‌డు నిర్మాత కం హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతున్న తీరు, రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర వేస్తున్న తీరు ఫెంటాస్టిక్‌. రియ‌ల్ హీరోయిజం విశాల్ బాడీలోనే ఉంద‌ని అభిమానులు చెబుతున్నారంటే అది ప్రాక్టిక‌ల్‌గా అత‌డు చేసి చూపిస్తున్నాడు కాబ‌ట్టే.

ఇప్పుడు త‌న గురువు త‌న‌కు విల‌న్‌గా న‌టిస్తార‌ని అత‌డు ఆనాడు ఊహించి ఉండ‌డు. కానీ ఊహించ‌నిది జ‌ర‌గ‌డ‌మే విధిరాత‌. విశాల్ న‌టించిన ఇరుంబు తిరై తెలుగులో అభిమ‌న్యుడు పేరుతో రిలీజ‌వుతోంది. మే 11 రిలీజ్ తేదీ. తాజాగా రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌లో విశాల్- అర్జున్ మ‌ధ్య వారియ‌ర్ సీక్వెన్సులు క‌ట్టి ప‌డేస్తున్నాయి. ధీటైన గురువుకు, అంతే ధీటైన శిష్యుడిగా విశాల్ క‌నిపిస్తున్నాడు. ఆర్మీ క‌మెండో లుక్‌లో విశాల్ అద‌ర‌గొట్టేస్తున్నాడు. ఈ ట్రైల‌ర్‌ని హిందీ ఆడియెన్ కోసం ప్ర‌ఖ్యాత క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు. సైబ‌ర్ వార్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో ఇంటెలిజెన్స్, యాంటీ హ్యాకింగ్ వంటి కాన్సెప్టుతో సినిమా ఆద్యంతం విశాల్, అర్జున్ మ‌ధ్య మైండ్ గేమ్ క‌ట్టి ప‌డేస్తుంద‌ని ట్రైల‌ర్ చెబుతోంది.