అఖిల్ దూకుడు తగ్గించుకోవాలా..లేటెస్ట్ కంప్లైన్ట్..?

Wednesday, November 1st, 2017, 08:33:31 PM IST

వివి వినాయక్ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలన్న అఖిల్ ఆశలు నెరవేరలేదు. ఫస్ట్ మూవీ డిజాస్టర్ కావడంతో తనయుడి రెండో చిత్రంపై నాగ్ స్పెషల్ ఫోకస్ పెట్టాడు. అఖిల్ ప్రస్తుతం ప్రతిభ గల దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రం పేరు ‘హలో’. ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించేలా నాగార్జున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఓ వైపు ప్రతిభ గల దర్శకుడి హార్డ్ వర్క్, మరో వైపు తండ్రి పర్యవేక్ష..ఇలాంటి పరిస్థితుల్లో వారు చెప్పింది చేయడమే ఆర్టిస్టుల పని. కానీ ఈ యంగ్ హీరో చీటికి మాటికి అన్ని విభాగాల్లో తల దూరుస్తూ దర్శకుడికి తలా భారంగా మారాడట. ఈ విషయాన్ని నాగార్జున దృష్టికి తీసులుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పుడే కాదు గతంలో కూడా వినాయక్ అఖిల్ తో అడ్జెస్ట్ కాలేకపోయారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అఖిల్ కాస్త దూకుడు తగ్గించుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments