ప్రశ్నించడం తప్పా? ప్రశ్నిస్తే హిందూ వ్యతిరేకిని అంటున్నారు : ప్రకాష్ రాజ్

Monday, May 7th, 2018, 03:44:03 PM IST

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా మధ్యమమ్ ట్విట్టర్ వేదికగా బిజెపి నేతలపైనా, అలానే ప్రధాని మోడీపైనా తనదైన శైలిలో జస్ట్ ఆస్కింగ్ పేరుతో పలు ప్రశ్నలు సంధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు కొందరు బిజెపి నాయకులు కూడా ఘాటుగానే బదులు ఇస్తున్నారు. ఇకపోతే మళ్ళి నేడు ఆయన మరొక్కసారి మోడీ పై విరుచుకుపడ్డారు. మోదీపాలనలో ప్రజలు సుభిక్షంగా వున్నారని ఆ పార్టీ చెపుతోంది, కానీ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు ఆయనకు తెలియనివా అన్నారు. బిజెపి నేతల పాలన, ప్రవర్తన తీరు ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టే విధంగా ఉందని విమర్శించారు.

అంతే కాదు మోడీ విధానాలు దళితులను, మైనారిటీలను బయటకు పంపేవిధంగా ఉందని, ఈ కుట్రను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తనని తాను దళితులపాలిటి ఆశాకిరణంగా చెప్పుకునే మోడీ పచ్చి అబద్దాలు చెపుతున్నారని అన్నారు. అయినా కర్ణాటకలో దోచుకుంటున్న ఇసుక యజమానులని క్షమించాల్సింది అక్కడి ప్రజలుకాని, యెడ్యూరప్ప కాదని ఎద్దేవా చేశారు. తాను చేసే ఈ పోరాటంలో ఎలాంటి దురుద్దేశం లేదని, తాను ఎలాంటి రాజకీయం చేయడంలేదని అన్నారు. తాను చేస్తున్న ఈ జస్ట్ ఆస్కింగ్ అనేది రాజకీయ పార్టీ కాదని, తన ఆందోళన మాత్రమేనని, కానీ తనమాటలకు బిజెపి నేతలు సమాధానం చెప్పలేక తనను ఒక హిందూ వ్యతిరేకిగా ముద్రవేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అయినా ప్రజాస్వామిక దేశంలో ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు……