ఫ్లాష్ న్యూస్ : భరత్ పాటల వేడుక అక్కడ జరుకానుందా ?

Saturday, March 24th, 2018, 05:31:40 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ దర్శకుడు. డివివి దానయ్య నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా గురువారంతో టాకీ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం ఓ పాట షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈనెల 26 నుంచి స్పెయిన్‌లో ఆ గీతాన్ని చిత్రీకరిస్తారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్‌ 7న విజయవాడలో పాటల్ని విడుదల చేస్తారని తెలుస్తోంది.

ఈ చిత్రంలో మహేష్‌ ముఖ్య మంత్రిగా కనిపించబోతున్నారు. కథకు, కథానాయకుడి పాత్రకూ తగినట్టు ఆడియో వేడుక దగ్గర అసెంబ్లీని పోలిన ఓ సెట్‌ వేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలయిన విజన్ ఆఫ్ భరత్ యూట్యూబ్ లో రికార్డు సృష్టిస్తోంది. ఈ టీజర్ ప్రపంచములోని అత్యధికులు లైక్ చేసిన రెండవ వీడియో గా అద్భుత రికార్డు సృష్టించింది. కాగా ఈ చిత్రంలోని తొలి పాటను రేపటి పండుగ శ్రీరామనవమి పండుగ కానుకగా ఉదయం 10 గంటలకు యూట్యూబ్ లో విడుదలచేయనున్నారు. కాగా ఏప్రిల్‌ 20న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు….