అరవింద సమేత ఆడియో వేడుకకు బాలయ్య?

Monday, September 3rd, 2018, 10:23:21 PM IST

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న నూతన చిత్రం అరవింద సమేత. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాధా కృష్ణ, హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలయిన ఈ చిత్ర టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర ఆడియో వేడుకకు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా రానున్నారు అనేది ఫిలింనగర్ లేటెస్ట్ టాక్. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణ చినకర్మ సందర్భంగా అబ్బయిలు కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్ లతో కలిసి బాలయ్య పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే కార్యక్రమం అనంతరం తండ్రి బిడ్డలవంటి బాబాయ్, అబ్బాయిల మధ్య అనుబంధం మరింత బలపడిందని,

అందువల్ల తన రాబోయే చిత్రం అరవింద సమేత ఆడియో ఫంక్షన్ కు బాబాయ్ ని అతిథిగా పిలవాలని ఎన్టీఆర్ అనుకున్నట్లు చెపుతున్నారు. ఇక చాలారోజుల నుండి ఎన్టీఆర్ మరియి బాలయ్యలు కలిసి ఎటువంటి వేడుకలో పాల్గొనకపోవడంతో ఈ ఆడియో విడుదల వేడుకతో మళ్ళి వారిద్దరూ కలిసి స్టేజిని పంచుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. ఒకరకంగా ఈ విషయమై త్రివిక్రమ్, ఎన్టీఆర్ చర్చించారని, త్వరలో జరగనున్న ఆడియోకు బాలయ్య తప్పనిసరిగా హాజరవుతారని అంటున్నారు. మరి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజం ఎంత ఉందొ తెలియాలంటే అరవింద సమేత మూవీ టీమ్ నుండి అధికారిక ప్రకటన వెలువడేవరకు వేచిచూడవలసిందే…..

  •  
  •  
  •  
  •  

Comments