భరత్ చిత్ర నిడివి పెరగనుందా?

Wednesday, April 25th, 2018, 02:08:33 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా భరత్ అనే నేను. ప్రస్తుతం ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక అటు ఓవర్సీస్ లోను సునామి సృష్టిస్తున్నాడు సూపర్ స్టార్. ఇప్పటివరకు ఓవర్సీస్ లో 2.5 మిలియన్ల సాధించిన ఈ సినిమా త్వరలో 3 మిలియన్లకు చేరుకోనుంది. అంతేకాదు ఇప్పటికేవరకు రూ.125 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు అందుకున్నాడు భరత్. అయితే గత రెండుమూడు రోజులుగా ఈ సినిమా విషయమై మహేష్ బాబు, కొరటాల పలు మీడియా చానెల్స్ కు ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాలో కొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారట నిజమేనా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు, కొరటాల మాట్లాడుతూ అవును యాడ్ చేయాలనుకుంటున్నాం.

కాకపోతే ఇప్పటివరకు థియేటర్ లో వున్న సినిమా అంత బాగుంది. కాబట్టి ఎటువంటి సన్నివేశాలు తొలగించకుండా వేరేవి జత చేయాలా లేక ఒకటి రెండు సన్నివేశాలు తొలగించాలా అనేది ఆలోచిస్తున్నాం అన్నారు. అయితే ఈ సినిమాలో హోలీ సందర్భంగా పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఒక ఫైట్ అద్భుతంగా ఉంటుందని, దాన్ని కూడా త్వరలో సినిమాలో జత చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ భరత్ అనే నేను చూసే ప్రేక్షకులకు, మహేష్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అవుతున్నారు మరి……

  •  
  •  
  •  
  •  

Comments