చంద్రబాబు చెబుతుంది నిజమేనా?

Sunday, August 18th, 2019, 12:01:54 PM IST

మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్ పైన ప్రభుత్వం పైన పలు ఆరోపణలు చేసారు. ప్రస్తుతం వరదల పైన, తన నివాసం గురించి మరియు ప్రజల కష్టాల గురించి తీవ్ర కోపం తో మండిపడి కొన్ని విషయాలను వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి ఇల్లు మునిగిపోయిందని, అది చూపించడానికి లక్షల కుటుంబాలతో జగన్ ప్రభుత్వం ఆడుకుంటుందని తెలియ చేసారు. వరద నియంత్రణ కార్యక్రమాలను గాలికొదిలేసి, నా ఇంటి పైన డ్రోన్ కెమెరాలను ఆపరేట్ చేస్తూ నా నివాసం గురించి నా భద్రత గురించి ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వలనే ప్రజలకు అపార పంట నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. చిత్తశుద్ధి లేని పాలనగా జగన్ ప్రభుత్వం ఉందని , గోదావరి వరదలకు జెరూసలేం వెళ్లారు, ఇపుడు ఈ కృష్ణ వరదలొస్తుంటే అమెరికా పర్యటనకి వెళ్లారు, ఇదేమి పాలనా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఆంధ్ర ప్రదేశ్ కి ఇక దూరం కానున్న పలు దేశాలు. ఇప్పటికే జపాన్ మరియు ఫ్రాన్స్ దేశాలు జగన్ తీరు పై మండి పడ్డాయి. వైసీపీ బెదిరింపులతో దౌర్జన్యాలతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని తెలియ చేసారు. పంటలను కోల్పోయిన రైతులను ఆదుకోవాలని, వారికీ ప్రస్తుత నిత్యావసరాలను అందించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. వరద వరద సహాయక చర్యలకు టీడీపీ నేతలు కార్యకర్తలు సహాయం అందించాల్సిందిగా పార్టీ నేతలకు తెలియ చేసారు.