మరో సంచలన నిర్ణయం దిశగా జగన్..ఏపీలో అలజడి

Wednesday, August 14th, 2019, 01:05:32 PM IST

జగన్ మోహన్ రెడ్డి సీఎం అయినా తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎలాంటి వ్యతిరేకత వచ్చిన కానీ వెనకడుగు వేయకుండా ముందుకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో సంచలనం నిర్ణయం తీసుకోవటానికి జగన్ సిద్దమైనట్లు తెలుస్తుంది. మరి కొద్దీ రోజుల్లో మీ సేవ కేంద్రాలను మూసివేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ అందించే సేవలను గ్రామ సచివాలయంలోనే అందేలా రంగం సిద్ధం చేస్తున్నట్లు అనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ఎలాంటి ప్రభుత్వ సేవలు కావాలన్నా వెంటనే అందరికి గుర్తువచ్చేది మీ సేవ. ప్రభుత్వానికి చెందిన దాదాపు 367 సేవలను అలాగే మరో 30 ప్రవేట్ సేవలను మీ సేవ అందిస్తుంది. ఆదాయం, రెవెన్యూ, రిజిస్ర్టేషన్స్‌,నివాస ధ్రువపత్రాలు, ఆదాయ ధ్రువపత్రాలు, ల్యాండ్‌ కన్వర్షన్‌, టైటిల్‌ డీడ్స్‌, అడంగల్స్‌ కాపీలు, ఫ్యామిటీ సర్టిఫికెట్‌, ఈ పాస్‌బుక్‌ రెన్యువల్స్‌ ఇలాంటి సేవలు మొత్తం మీ సేవ కేంద్రాలు అందిస్తున్నాయి. మీ సేవ కేంద్రాలకు కమిషన్ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒక్కో సేవకి ప్రజల నుండి వసూళ్లు చేసే దానిలో కమిషన్ ఇస్తుంది.

మీ సేవలను రద్దు చేసి వాటిని గ్రామ సచివాలయంలోనే డిజిటల్ అధికారి కి అప్పగిస్తే మీ సేవ కేంద్రాలకు ఇచ్చే కమిషన్ మిగులుతుందని ప్రభుత్వ ఆలోచన అని తెలుస్తుంది. అదే విధంగా మీ సేవ కేంద్రాలను రద్దు చేయకుండా వాటిని గ్రామ సచివాలయంలో కలిపేస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మీ సేవ కేంద్రాలు రద్దు అనే విషయం తెలిసేసరిగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో జిల్లాలో సరాసరి 5 వేల మంది దాక మీసేవలో పని చేసేవాళ్ళు ఉన్నారు. ఒక వేళ మీ సేవ కేంద్రాలు రద్దు చేస్తే మా పరిస్థితి ఏమిటనే భయంతో ఉన్నారు..