రణవీర్, దీపికల నిశ్చితార్ధం పూర్తిఅయిందా !

Tuesday, January 9th, 2018, 07:01:02 PM IST

ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పాడుకొనే, నటుడు రణవీర్ సింగ్ ల మధ్య చాలా కాలం నుండి ప్రేమాయణం నడుస్తుంది, అయితే వీరిద్దరికి ఇటీవలే నిశ్చితార్ధం జరిగిందనే ఒక వార్త ఇప్పుడు మీడియా లో షికార్లు చేస్తోంది. ఈ నెల 5 (జనవరి) న దీపికా పుట్టిన రోజు సందర్భంగా , ఆమె పుట్టిన రోజు వేడుకలు ప్రత్యేకంగా మాల్దీవుల్లో జరుపుకున్నారని కొందరు, లేదు శ్రీలంక లో జరుపుకున్నారని మరి కొందరు అంటున్నారు.

వేడుకలు ఎక్కడ జరిగాయి అనే దానిమీద స్పష్టత లేకపోయినప్పటికీ దీపికా కి పుట్టిన రోజు కానుకగా రణవీర్ ఒక డైమండ్ నెక్లెస్, ఖరీదైన డిజైనర్ చీరను బహుమతి గా ఇచ్చినట్లు, ఆ పై ఇరువురు ఎంగేజ్మెంట్ ఉంగరాలు మార్చుకున్నారని, ఈ కార్యక్రమం అంతా ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగినట్లు చెప్పుకుంటున్నారు. ఈ విషయమై దీపికా తండ్రి ప్రకాష్ స్పందిస్తూ , వాళ్లిద్దరూ మేజర్లు, ఏమి చేస్తున్నారో వాళ్లకి తెలుసు. నేను దీపికా కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను, ఆమె నిర్ణయం ఆమె ఇష్టం అని ఆయన అన్నారు. దీపికా తండ్రి మాటలు వింటుంటే నిజంగానే వారిద్దరికీ నిశ్చితార్ధం జరిగి ఉంటుందనే భావన ఎవరికైన కలుగక మానదు.