శ్రీదేవి మరణం ఆయనకు ముందే తెలుసా?

Sunday, February 25th, 2018, 11:47:10 AM IST

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. శనివారం రాత్రి దుబాయ్ లో ప్రముఖ సినీ నటి శ్రీదేవి తుదిశ్వాస విడిచారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ అందరూ కోరుకుంటున్నారు. శ్రీదేవి మరణానికి ముందు ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఇప్పుడు ఈ ట్వీట్ పై చర్చించుకుంటున్నారు. ‘ఎందుకో తెలియదు మనసులో ఎన్నడూ లేనంత అలజడి రేగుతూ ఆందోళనకు గురవుతున్నా’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. శ్రీదేవి మరణించడాకి కాసేపటి ముందు ఆయన ఈ ట్వీట్ చేశారు.

ఏదో చెడు జరగబోతోందనే విషయం వల్లే ఆయన ఆందోళనకు గురయ్యారా అని అందరూ చర్చించుకుంటున్నారు. దీంతో ఆమె చనిపోతారని అమితాబ్‌ ముందే ఊహించే ఆ ట్వీట్‌ చేశారా అని కొందరు అభిప్రాయపడుతన్నారు. అమితాబ్‌కు సిక్స్త్‌ సెన్స్‌ పని చేసిందని, అందుకే ఆయన జరగబోయేది ముందే తెలిసిపోయి ఉంటుందని అని అంటున్నారు. అయితే శ్రీదేవి అమితాబ్‌తో కలిసి ఐదారు చిత్రాల్లో నటించారు. ఆమె కుటుంబంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె కుటుంబ సభ్యులో లేక సన్నిహిత వ్యక్తులో బిగ్‌ బీకి వెంటనే సమాచారం అందించి ఉంటారని, అందుకే ఆయన అలా ట్వీట్‌ చేసి ఉంటారని భావిస్తున్నారు…