యన్టీఆర్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ ?

Saturday, January 27th, 2018, 02:57:48 PM IST

జూనియర్ యన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ఇటీవల పవన్ కళ్యాణ్ చేతులమీదుగా మొదలయిన విషయం అందరికి తెలిసిందే. అయితే పవన్ తో త్రివిక్రమ్ చేసిన అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడడంతో తదుపరి చేయబోయే యన్టీఆర్ చిత్రం కోసం ఆయన ప్రతి విషయం లొను తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి మనకి అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ చిత్రంలో అల్లు అర్జున్ డీజేలో నటించిన పూజ హెగ్డే ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం కోసం యన్టీఆర్ కూడా దాదాపు 18 కేజీలు బరువు కూడా తగ్గి స్లిమ్ అయ్యారని తెలుస్తోంది. అవుట్ ఫుట్ బాగా రావడం కోసం స్క్రిప్ట్ లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారని, అంతే కాక త్రివిక్రమ్ తన వర్కింగ్ టీం లో కొంత మందిని మార్చి, కొత్తవారికి కూడా అవకాశం ఇచ్చారని, ఎలాగైనా ఈ చిత్రం మంచి విజయం సాధించాలనే పట్టుదలతో ఆయన తగు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మంచి లవ్, ఫామిలీ ఎంటెర్టైనెర్ గా త్రివిక్రమ్ తరహా కామెడీ పంచెస్ తో ఈ చిత్రం రూపొందనుందని తెలియవస్తోంది….