చంద్రబాబు ఆ భవనాన్ని ఖాళి చేయకపోడానికి కారణం అదేనా…?

Tuesday, June 25th, 2019, 01:00:25 AM IST

చంద్రబాబు ఏపీలో అధికారాన్ని కోల్పోయాక, ఏపీలో కొత్తగా ఏర్పాటైన వైసీపీ ప్రభుత్వం కావాలనే చంద్రబాబుని టార్గెట్ చేసి మరీ ఈ పనులన్నీ చేస్తుందని ప్రభుత్వ పనులను చుస్తే అర్థమవుతుంది. ప్రస్తుతానికి చంద్రబాబు ఉంటున్న ఇంటిని ఖాళి చేయమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా చంద్రబాబు ససేమిరా అంటూ ఖాళి చేయడానికి అసలే ఒప్పుకోవడం లేదు. కాగా ఈ విషయంలో చంద్రబాబు వ్యవహారంలో అందరికీ అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే చంద్రబాబు ప్రస్తుతానికి ఉంటున్న నివాసం లింగమనేని గెస్ట్ హౌస్. కానీ ఆ గెస్ట్ హౌస్ ఎప్పుడో చంద్రబాబు పేరు మీదకి మారిపోయిందని, అదెప్పుడో చంద్రబాబు సొంతమైపోయిందనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది. అంతేకాకుండా చంద్రబాబు ఈ ఇంటిని సొంత చేసుకున్నారు కాబట్టే గత ప్రభుత్వం తరపున లింగమనేనికి విపరీతమైన లబ్ది చేరూర్చినట్లు సమాచారం.

అయితే చంద్రబాబు, లింగమనేని నుండి భవనం చేజిక్కించుకోగానే వాస్తు మార్పులు చేయించారు. 15 కోట్లు పెట్టి సరైన ఫర్నీచర్ ను కూడా కొనుగోలు చేసి, మరికొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంటీరియర్ డెకరేషన్ కూడా చేయించారు. మరీ అంత డబ్బు పెట్టి మరీ దగ్గరుండి దాని హుందాగా తయారు చేయించుకున్న చంద్రబాబు, ఇప్పుడు ఆ హౌస్ ఖాళి చేయడానికి మనసొప్పటం లేదని తెలుస్తుంది. అయితే చంద్రబాబు ఈ పనిని అధికారాన్ని కోలోగానే చేయాల్సి ఉంది కానీ ఇప్పటికి కూడా ఆ పని చేయడానికి చంద్రబాబు ఒప్పుకోవడం లేదు ఎందుకని ఇప్పటికే పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆ ఇంటిని సొంతం చేసుకున్నాడు కాబట్టే ఖాళీ చేయడానికి ఒప్పుకోవట్లేదని పలువురు వైసీపీ నేతలు కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.