అది ఎన్టీఆర్ కు చెప్పిన కథ కాదంటున్న దర్శకుడు ?

Saturday, May 5th, 2018, 10:14:22 AM IST

తెలుగులో రచయితగా పలు సూపర్ చిత్రాలకు కథలు అందించి మంచి పేరు తెచ్చుకున్నాడు రచయితా వక్కంతం వంశీ. తాజాగా అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. నిన్న విడుదలైన ఈ సినిమాపై మిక్సెడ్ టాక్ వస్తుంది. అల్లు అర్జున్ అభిమానులకు తప్ప .. వేరే ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా నచ్చలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కథను మూడు ఎన్టీఆర్ కు చెప్పాడని అయన నో చెప్పడంతో అదే కథను బన్నీకి చెప్పి ఒప్పించుకున్నాడట.

ప్రస్తుతం ఎక్కడ చుసిన ఈ విషయం గురించే చర్చలు జరుగుతున్నాయి. తాజగా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు వంశీ .. ఈ కథను ముందు ఎన్టీఆర్ కు చెప్పింది కాదు .. నిజానికి ఎన్టీఆర్ కు చెప్పింది వేరే కథ .. అని చెప్పాడు. తనను దర్శకుడిగా చూడాలని ఎన్టీఆర్ ఎప్పటినుండో చెబుతున్నాడని, తప్పకుండా ఆయనతో సినిమా చేస్తానని, తాను రాసుకున్న కథ కేవలం ఆయనకే సూట్ అవుతుందని అంటున్నాడు. మరి ఇప్పటికే కథ విని రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్ మళ్ళీ అదే కథని ఓకే చేస్తాడా ? అన్నది డౌట్ !!

Comments