జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వదిలేయట్లేదు కదా?

Tuesday, June 11th, 2019, 04:42:58 PM IST

ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పరిపాలన ఈ కొద్ది రోజుల్లోనే అద్భుతంగా ఉంది అని ఇతర పార్టీల పక్షాలే అంటుండగా మరో పక్క రాష్ట్రానికిస్ సంబందించిన కీలక అంశాన్ని వదిలేయడం లేదు కదా అని కొత్త కొత్త ప్రశ్నలు మరియు అనుమానాలు లేవనెత్తుతున్నారు. అదేమిటంటే రాష్ట్రానికి ఎంతో ఆవశ్యకమైన “ప్రత్యేక హోదా” గురించే.దీనికి సంబంధించి జగన్ ఇంకాస్త సీరియస్ గా ఉంటే రాష్ట్రానికి మంచిదని సీనియర్ మోస్ట్ నాయకులు అంటున్నారు.

ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ ఇప్పటికే చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేస్తున్నారని ఇది చాలా హర్షణీయమైన విషయం అని సిపిఐ పార్టీకు చెందిన కీలక నేత నారాయణ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసారు.జగన్ రాష్ట్రంపై చూపించిన శ్రద్ధ కేంద్రంతో పోరాడడం విషయంలో చూపిస్తునట్టుగా అనిపించడం లేదని అంటున్నారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ఆవశ్యకమో అందరికీ తెలుసనీ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం మెడలు వంచి అయినా సాధిస్తామని అన్నారని కానీ ఫలితాలు వచ్చాక వారికి అధిక మెజార్టీ వచ్చిందని ఇలా లైట్ తీసుకుంటే కుదరదని ఎప్పుడూ కేంద్రం పియా ఒత్తిడి తీసుకొస్తూ రాష్ట్రానికి జగన్ ప్రత్యేక హోదా తీసుకు రావాలని అన్నారు.