పవన్ అంటే జగన్ కు నిజంగానే అంత భయమా.?

Wednesday, August 14th, 2019, 09:45:59 AM IST

ఇప్పుడున్న ఏపీ రాజకీయ వర్గాల్లో ఉన్న నాయకుల్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న రాజకీయ నాయకుల్లో వైసీపీ అధినేత జగన్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లు పేర్లు చెప్పుకోవాలి.అయితే ఎన్నికల ఫలితాలు అన్న అంశాన్ని పక్కన పెట్టినట్టైతే అసలు పవన్ అంటేనే లెక్క చెయ్యని వైసీపీ అభిమానులు సైతం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే పవన్ స్టామినా ఏంటో జగన్ కు తెలుసు అనే చెప్పాలి.

అందుకే సమయం దొరికినప్పుడల్లా పవన్ కు ఏదొకలా తొక్కే ప్రయత్నమే చేసారు.సినీ నటులను రంగంలోకి దింపడం అయితేనేమి ఆఖరుకు పవన్ ఫోటోను కూడా వారి పత్రిక అయినటువంటి “సాక్షి”లో వేసేందుకు కూడా ధైర్యం చెయ్యడం లేదంటేనే మనం అర్ధం చేసుకోవచ్చు.అంతే కాకుండా పవన్ ఒక్కడిని ఓడించడానికి గాజువాక మరియు భీమవరం నియోజకవర్గాల్లో కూడా ఎంత ఖర్చు చేసారో కూడా అందరికి తెలిసిందే.ఇంతకీ ఇప్పుడు ఈ రచ్చ అంతా ఎందుకు వచ్చిందంటే తాజాగా జనసేనాని ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.

దానికి సంబందించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి కానీ ఒక్క సాక్షి పత్రికలో మాత్రం పవన్ ఫోటోను తప్పించి మిగతా వారి ఫోటోలను మాత్రమే ప్రచురించారు.దీన్ని ఏమనుకోవాలి?మరి పవన్ అంటే ఆ మాత్రం భయం లేకపోతే అంతలా కక్ష కట్టి అన్ని డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు ఇంకా అసలు పవన్ ఫోటో కూడా ఎందుకు మీ పేపర్ లో వేయలేకపోతున్నారు అని జనసైనికులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

పవన్ పేరు వింటినే వెన్నులో వణుకు పుడుతుంది 😂😂

Posted by Jai Bharat on Tuesday, August 13, 2019