పెళ్లిపీటలెక్కనున్న శ్రీదేవి కుమార్తె ?

Tuesday, May 8th, 2018, 03:04:23 PM IST

దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ త్వరలో పెళ్లిపీటలెక్కనుందా, అంటే నిజానికి కాదు అనే అనాలి. అయితే నేడు జరిగిన ఒక ఆసక్తికర సంఘటనలో భాగంగా తదుపరి ఆమె వివాహం చేసుకుంటుందేమో అని అందరూ అనూకున్నారు. వివరాల్లోకి వెళితే అనిల్ కపూర్ గారాలపట్టి సోనమ్ కపూర్, ఆనంద్ అహుజాల వివాహం నేడు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా నిన్న ఏర్పాటు చేసిన మెహందీ కార్యక్రమానికి అతిధులందరితోపాటు శ్రీదేవి కుమార్తెలు జాన్వీ, ఖుషి కూడా మంచి సందడి చేశారు. సిక్కుల సంప్రదాయం ప్రకారం పెళ్లి కుమార్తె చుధ అంటే ఎర్రని గాజులు వేసుకుని,

ఆపై పెద్ద సైజులో వుండే చెవులకు ధరించే బుట్టల వంటి ‘కలిరే’ ధరిస్తుంది . తరువాత పెళ్లికుమార్తె వాటిని ఏ యువతికి దానిని తాకిస్తుందో ఆ ఇంట తదుపరి జరగబోయే పెళ్లి ఆ యువతిది అని అర్ధం. ఆ కాలేరు ధరించిన సోనమ్ జాన్వీ కూర్చున్న కుర్చీ వద్దకు వచ్చి ఆమె తలకు తాకించబోయింది. తాకించినంత పని చేసి మొత్తానికి తాకించలేదు లెండి. సారీ జాన్వీ అంటూ నవ్వుతూ ఆటపట్టించగా, వెంటనే జాన్వీ హమ్మయ్య నేను తప్పించుకున్నాను అనుకుంటూ పేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అయితే ఈ మొత్తం తతంగం తాలూకు వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ సోనమ్ కు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు…….