రామ్ చరణ్ కు జోడిగా కైరా అద్వానీ ?

Thursday, January 18th, 2018, 12:54:21 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో వస్తున్న నూతన చిత్రం షూటింగ్ రేపటి నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లో కథానాయికగా బాలీవుడ్ నటి కైరా అద్వానీని ఎంపిక చేశారని అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వం లో వస్తున్న చిత్రం లో ఆమె కథానాయికగా నటిస్తున్నారు, అదే ఆమెకు తెలుగు లో తొలి చిత్రం. ఇది ఆమెకి రెండవ చిత్రం కానుంది. ధ్రువ సక్సెస్ తో మంచి ఫామ్ లో వున్న చరణ్, త్వరలో రంగస్థలం తో వేసవి లో సందడి చేయనున్నాడు. అటు బోయపాటి కూడా మంచి విజయాలతో దూసుకుపోతున్నారు, వీరి కలయిక లో వస్తున్న ఈ చిత్రం కూడా మాస్ చిత్రమే అయి ఉంటుందని సమాచారం. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించనున్నారు. హీరోయిజాన్ని తనదైన మాస్ స్టైల్లో అద్భుతంగా ఎలివేట్ చేయగల బోయపాటి తమ హీరోని ఈ చిత్రం లో ఏవిధంగా చూపిస్తారో అని చరణ్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments