దీపికా తో కలిసి నటించడానికి నో చెప్పిన కోహ్లీ?

Friday, March 23rd, 2018, 05:36:21 PM IST

భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీ విషయమై ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని పలువురు ఈ వార్తను షేర్ చేస్తున్నారు. తాజాగా ఆర్‌సీబీతో ఒప్పందం కుదుర్చుకున్న గోఐబిబో విరాట్‌ కోహ్లీ, దీపిక పదుకొణె తో కలిసి ఐపీఎల్‌ కోసం ఓ యాడ్‌ తీద్దామనుకున్నారు. ఇదే విషయాన్ని కోహ్లీకి తెలపగా, దీనికి అతడు నో చెప్పినట్లు సమాచారం. ఇంతకీ కోహ్లీ ఏంటి, దీపికతో నటించడం ఏమిటి అనే కదా మీ సందేహం. ప్రస్తుతం భారత్‌లో మెగా ఐపీఎల్‌ టోర్నీ సందడి మొదలైంది ఏప్రిల్‌ 7 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం ఇప్పటి నుంచి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు గోఐబిబో సంస్థ రూ.11కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది.

గత సంవత్సరం బాలీవుడ్‌ భామ దీపిక పదుకొణెని గోఐబిబో బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. దీంతో ఆ సంస్థ ఆర్‌సీబీతో తన ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై గోఐబిబో అధికారులు మాట్లాడుతూ, మా యాడ్‌లో నటించనని కోహ్లీ నో చెప్పలేదు. ప్రచార కార్యక్రమాల్లో మరో సెలబ్రెటీతో నటించనని మాత్రమే చెప్పారు, అని వారు అంటున్నారు. ఇప్పటికే ఒప్పో మొబైల్స్‌కి కోహ్లీ, దీపికలు బ్రాండ్‌ అంబాసిడర్లగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో రాయల్ ఛాలెంజర్ స్ బెంగుళూరు జట్టుకు దీపిక పదుకొణె బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న సంగతి విదితమే. ఐతే ఈ విషయమై అసలు నిజామేమిటన్నది ఆ పరమాత్ముడికి ఎరుక అని పలువురు అభిప్రాయపడుతున్నారు….