నానితో కొరటాల మూవీ ఫిక్స్ అయిందా ?

Monday, May 14th, 2018, 09:07:00 PM IST

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజీ, ఇటీవల భరత్ అనే నేను. ఇలా చెప్పుకుంటూ పోతే దర్శకుడు కొరటాల దర్శకత్వం వహించిన ప్రతి సినిమా పెద్ద హిట్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రంపై పలురకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్, మెగా స్టార్ చిరంజీవి పేర్లు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. ఒకవైపు చిరంజీవి సైరా తో బిజీగా ఉండడం, మరోవైపు అల్లు అర్జున్ కూడా తదుపరి చిత్రం విక్రమ్ కుమార్ తో చేసే అవకాశం కనిపించనుండడంతో ఆయన ప్రస్తుతం ఎవరైనా చిన్న హీరోతో ఒక మంచి సినిమా చేయాలనే ఆలోచనతో వున్నారని ఫిలిం నగర్ టాక్.

అందులో భాగంగానే ఇటీవల వరుసహిట్లు కొడుతున్న నాచురల్ స్టార్ నానిని కలిసి ఒక అద్భుతమైన కథ వినిపించారని, కథ విన్న నాని కూడా చాలా ఇంప్రెస్ అయి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసుకోమన్నట్లు తెలుస్తోంది. పోతే కొరటాల ప్రస్తుతం కొద్దిరోజులు కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్లనున్నారని, తిరిగిరాగానే నాని తో మూవీ స్క్రిప్ట్ పనులపై కూర్చుని, ఆ వెంటనే చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని అంటున్నారు. కాగా చిత్రాన్ని కొరటాల శివ సన్నిహితుడు సుధాకర్ నిర్మిస్తారని చెప్తున్నారు. అయితే ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడవలసిందే…….

  •  
  •  
  •  
  •  

Comments