డాక్టర్ ను లైఫ్ పార్టనర్ గా చేసుకోబోతున్న మిల్కీ బ్యూటీ?

Wednesday, July 25th, 2018, 06:17:58 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లు గా వెలుగొందుతున్న వారిలో మిల్కీ బ్యూటీ గా పేరు గాంచిన తమన్నా ఒకరు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ నటీమణుల్లో అనుష్క శెట్టి త్వరలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ని త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారు అనే వార్త గత కొద్దికాలంగా టాలీవుడ్ వర్గాల్లో షికారు చేస్తోంది. ఇకపోతే ప్రస్తుతం తమన్నా కూడా త్వరలో ఒక ఇంటివారు కాబోతున్నారు అని సమాచారం. ఇటీవల ఆమె పెళ్లి విషయమై మాట్లాడిన ఆమె తల్లి రజిని భాటియా, 2019లో తమన్నా పెళ్ళికి ప్లాన్ చేస్తున్నామని,

అయితే తమన్నా మాత్రం తనకు మాలాగే చూసుకునే మంచి అబ్బాయి దొరికితే చేసుకుంటాను అంటోందని తల్లి రజిని చెప్పారు. ఇప్పటికే ఈ విషయమై సంబంధాల వెతుకులాట కూడా ప్రారంభించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. అయితే తమన్నాకు అమెరికాకు చెందిన ఒక డాక్టర్ తో పెళ్ళికి ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం తెలుగులో తమన్నా బాలీవుడ్ లో విడదలయి సూపర్ హిట్ అయిన క్వీన్ చిత్రం రీమేక్, అలానే వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లతో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టి స్టారర్ ఎఫ్2లోని నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం తామన్న పెళ్లిపై వస్తున్న ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మరికొద్దిరోజుల్లో ఆగాలి…..

  •  
  •  
  •  
  •  

Comments