నాగ్ ట్వీట్ ఆఫీసర్ గురించేనా ?

Monday, June 4th, 2018, 01:20:42 PM IST

అక్కినేని నాగార్జున హీరోగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం ఆఫీసర్. ఇదివరకు చాలా ఏళ్ళ క్రితం వీరిద్దరి కలయికలో వచ్చిన శివ చిత్రం అప్పట్లో సంచలన విజయం అందుకున్న తెలిసిందే. ఇక ఆ తరువాత భారీ అంచనాలతో వచ్చిన గోవిందా గోవిందా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం వీరి కలయికలో వచ్చిన ఆఫీసర్ కూడా డిజాస్టర్ గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన ఇప్పటికే కొందరు బయ్యర్లు ఏ మేరకు నష్టం వస్తుందో అని భయపడుతున్నారట. ఇక నేడు హీరో నాగార్జున సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక ట్వీట్ ఈ చిత్రం గురించే అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.

”అందరికి గుడ్ మార్నింగ్ వారం గడిచిపోయి మళ్ళి సోమవారం వచ్చింది. విజయం అనేది అంతిమంకాదు, అలా అని పరాజయం భయానకం కూడా కాదు. ఏమి జరిగినా ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగడమే మనిషి లక్షణం అని విన్ స్టెన్ చర్చిల్ చెప్పిన మాటలను చెప్పుకొచ్చారు నాగ్. ఆయన చెప్పినట్లు ఎప్పుడు చిరునవ్వుతోనే నా జీవిత గమనాన్ని సాగిస్తాను, హేవ్ ఏ గ్రేట్ డే” అని పోస్ట్ చేసారు. అయితే నాగ్ ఆఫీసర్ విషయంలో పూర్తిగా నిరాశ చెంది ఈ ట్వీట్ చేసారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం విడుదల రోజున కనీసం రూ.50 లక్షలు షేర్ కూడా పొందలేకపోయిందని, రెండు రోజులకే పూర్తి డెఫిషిట్ లో పడిపోయిందని, ఈ పరిస్థితి చూస్తుంటే ఇటీవల విడుదలయిన అతిపెద్ద డిజాస్టర్ చిత్రాల వరుసలో ఇది కూడా నిలిచి అవకాశం ఖాయంగా కనపడుతోందని సినీ విశ్లేషకులు అంటున్నారు…..