నానీ ని చూసి భయపడుతున్న హీరోలు

Saturday, February 11th, 2017, 11:05:36 AM IST


వరస ప్లాపులతో మూడేళ్ళ క్రితం వరకూ డీలా పడిన హీరోగా ఉన్నాడు హీరో నాని. ఇండస్ట్రీ నుంచి త్వరలో మాయం అయిపోతాడు అన్నారు కూడా చాలా మంది. ఆరు నెలల కి పైగా చేతిలో సినిమా కూడా లేక సతమతం అయ్యాడు. అదే టైములో ఏ ముహూర్తం లో ఎవడె సుబ్రహ్మణ్యం మొదలు పెట్టాడో కానీ నేను లోకల్ వరకూ వరస అద్భుత హిట్ లతో సాగిపోతున్నాడు. తన నటనతో యావరేజ్ కథలు కూడా నిలబెట్టేస్తున్నాడు మనోడు. ఇప్పుడు స్టార్ హీరోల కంటే కూడా నాని సినిమా అంటే ప్రేక్షకులు.. బయ్యర్లు.. దర్శక నిర్మాతలు.. అందరిలోనూ ఒక భరోసా. నాని అయితే తమ కథలకు న్యాయం చేస్తాడని రచయితలు.. దర్శకులకు భరోసా.. నాని సినిమా అయితే లాభాలు గ్యారెంటీ అని నిర్మాతలకు భరోసా.. నాని సినిమా అయితే కచ్చితంగా బాగుంటుందని ప్రేక్షకులకు భరోసా.. ఇలా అందరికీ భరోసా ఇస్తున్నాడు నాని. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్లో మిగతా కథానాయకులు.. ముఖ్యంగా వారసత్వ హీరోలు నానిని చూసి భయపడే పరిస్థితి నెలకొంది.