నారా లోకేష్ రె”ఢీ” అంటున్నాడా..?

Saturday, June 27th, 2020, 07:04:32 AM IST

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దైవిద్యమానంగా తయారయ్యింది. ముఖ్యంగా ప్రస్తుత అదినేత చంద్రబాబు తర్వాత ఎవరు అన్నా ప్రశ్న వచ్చినపుడు వినిపిస్తుంది లోకేషే అయినా అతనికి పగ్గాలు ఇస్తే సమర్ధవంతంగా రాణించగలడా లేదా అన్నది చాలా మంది టీడీపీ నేతల మదిలో ప్రశ్నార్ధకంగా మారిపోయింది.

కానీ లోకేష్ మాత్రం సన్నద్ధం అవ్వడం ఎప్పటి నుంచో ప్రారంభించినట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి అయితే అధికార పార్టీ పై మరింత దూకుడుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కేవలం సోషల్ మీడియాకు మాత్రమే అంకితం చెయ్యకుండా మీడియా ముందు కూడా అదే దూకుడుతనం ప్రదర్శించడం విశేషం. మొత్తానికి మాత్రం లోకేష్ రెడీ అవుతూనే ఢీ కొట్టడానికి సై అంటున్నట్టు తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో లోకేష్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో చూడాలి.