అఖిల్ మూడో సినిమా రీమేకా..?

Monday, September 25th, 2017, 01:02:36 PM IST


అక్కినేని వారసుడు అఖిల్ తొలి చిత్రం విఫలం కావడంతో భవిషత్తులో నటించబోయే చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అఖిల్ రెండవ చిత్రాన్ని విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా నాగార్జున నిర్మిస్తున్నారు. ఎలాగైనా రెండవ చిత్రంతో హిట్టు కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. కాగా అఖిల్ మూడవ చిత్రం గురించి కూడా అప్పుడే వార్తలు మొదలయ్యాయి. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన హే జవానీ హే దివాని చిత్రాన్ని రీమేక్ చేసే ఉద్దేశంలో అఖిల్ ఉన్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఇది రెండవ సినిమాగా తెరకెక్కాలి. కానీ సడెన్ గా అఖిల్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ కే ఒకే చెప్పాడు.హే జవానీ హే దివాని కథని తెలుగు వారికి తగ్గట్లుగా మారిస్తే సక్సెస్ అవుతుందనే అభిప్రాయంలో అఖిల్ ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఇలాంటి కథలు తనకు సరిపోతాయని అఖిల్ అనుకుంటున్నాడట. ఈ కథని తనకుతగ్గట్లుగా రాయమని కొందరి రచయితలకు అఖిల్ సూచించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లోనే ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments