త్రివిక్రమ్ కొత్త కథ.. ఎన్టీఆర్ సైడ్ అయిపోయినట్లేనా..?

Monday, January 29th, 2018, 04:24:57 PM IST

అజ్ఞాతవాసి చిత్రంతో మాటల మాంత్రికుడు తివిక్రమ్ డిజాస్టర్ తో పాటు విమర్శలు విమర్శలు సైతం మూటగట్టుకోవాల్సి వచ్చింది. అజ్ఞాతవాసి చిత్రం ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ కు కాపీ అని విమర్శలు వస్తున్న త్రివిక్రమ్ మాత్రం స్పదించలేదు. ఒక వేళ చిత్రం విజయం సాధించి ఉంటె ఈ విమర్శలకు త్రివిక్రమ్ సమాధానం చెప్పి ఉండేవాడేమో. అజ్ఞాతవాసి తరువాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టాల్సి ఉంది. ఆ చిత్రం ఆలస్యం అవుతోందా లేక ఆగిపోయిందా అనే సమాధానం మాత్రం దొరకడం లేదు.

కాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం త్రివిక్రమ్ కొత్త కథపై కన్నేసినట్లు చరించుకుంటున్నారు. ఈ సారి ఎటువంటి వివాదాలకు తావు లేకుండా మధుబాబు నవలల పై త్రివిక్రమ్ ఆసక్తి చూపుతున్నారట. స్వయంగా మాటల మాంత్రికుడే ఆ నవలల హక్కులని సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా త్రివిక్రమ్ ఓ యాక్షన్ మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆల్ రెడీ ఎన్టీఆర్ సినిమా ఉండగా త్రివిక్రమ్ కు కొత్త కథ అవసరం ఏమొచ్చింది అనే సందేహాలు సైతం కలుగుతున్నాయి. ఈ వార్తలతో ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందా అనే ప్రచారం కూడా ఎక్కువవుతోంది.