వైరల్ న్యూస్ : కుక్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్?

Wednesday, March 28th, 2018, 03:53:03 PM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాను త్రివిక్రమ్ చేయబోయే సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలనే గట్టి నమ్మకం పెట్టుకున్నారు. దానికి తగ్గట్లే సినిమా కోసం త్రివిక్రమ్ కూడా పలు మార్పులు చేర్పులు చేశారని వినికిడి. ఇకపోతే ఎన్టీఆర్ కూడా ఆ సినిమా లోని పాత్రకు తగ్గట్లు తన శరీర ఆకృతిని మలుచుకునే పనిలో వున్నారు. అయితే గత కొద్దిరోజులుగా అయన ఒక బాలీవుడ్ జిమ్ కోచ్ వద్ద శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. అలానే తన వెయిట్‌ను భారీగా తగ్గించుకునేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి ఇంకా వెయిట్ రెడ్యూస్ అవ్వాలని ఆయన తెగ ట్రై చేస్తున్నారు. ప్రతిరోజు మూడు గంటలపాటు జిమ్‌లోనే గడుపుతున్నారట. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ తన పర్సనల్ కుక్‌కి కూడా స్ట్రిక్ట్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేసినట్టు సమాచారం. వంటలో వాడే పదార్థాల గురించి, వండాల్సిన ఆహారం, వండే విధానం గురించి తన కుక్‌కి స్ట్రిక్ట్‌గా చెప్పేశారట ఎన్టీఆర్. దీంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్‌పై సర్వత్రా ఆసక్తి రేకెత్తుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ని చూసిన ఆయన సన్నిహితులు కొందరు ఈ సరికొత్త లూక్లో తారక్ చాల యంగ్ గా కనపడుతున్నారని కితాబిస్తున్నారు. అయితే ఆ లుక్ పూర్తిగా రెవీల్ కావాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి మరి….