‘పద్మావత్’ ఈనెల 25 న రాబోతోందా?

Tuesday, January 16th, 2018, 11:38:57 AM IST

ప్రముఖ నటి దీపికా పాడుకొనే, రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పద్మావత్’. ఇప్పటికే ఎన్నో వివాదాలను ఈ చిత్రం ఎదుర్కొందన్న విషయం మనకి అందరికి తెలిసిందే. చివరకు టైటిల్ ని కూడా మార్చిన విషయం కూడా విదితమే. వివాదాల విషయం ఎలా వున్నా ఈ చిత్ర ట్రైలర్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది. ట్రైలర్ విడుదల తర్వాత అటు ఉత్తరాదినే కాక ఇటు దక్షిణాదిన కూడా మంచి క్రేజ్ సంపాదించిందని చెప్పవచ్చు. డిసెంబర్ 1 న విడుదల అవ్వవలసిన ఈ చిత్రం ఎన్నో వివాదాల తర్వాత ఎట్టకేలకు ఈ నెల రిపబ్లిక్ డే కానుకగా 25 న విడుదల అవుతుందని సమాచారం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే నిర్మాత, దర్శకుడు భన్సాలీ ఆ రోజున పక్కాగా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. అక్కడి పరిస్థితి ఎలా వున్నా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్ర విడుదలకు ఎటువంటి అడ్డంకులు లెవని, ఈ చిత్రాన్ని 3డి లోను విడుదల చేస్తున్నారని, ఖచ్చితంగా చిత్రం ఘనవిజయం సాదిస్తుందనే నమ్మకం యూనిట్ వ్యక్తపరుస్తోంది…