పాకిస్థాన్ మరీ ఇంతలా దిగజారిందా…?

Wednesday, June 12th, 2019, 02:20:36 AM IST

ఇంగ్లాంగ్ లో ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు జరుగుతున్న సంగతి నాకు తెలిసిందే… అందులో భాగంగా ఈ నెల 16న భారత్ మరియు పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనున్న సంగతి మనకు తెలిసిందే… ఈ సందర్భంగా పాకిస్థాన్ మీడియా మాత్రం మరీ దిగజారి ఒక దారుణమైన పబ్లిసిటీకి తెగపడింది. ప్రస్తుతానికి పాకిస్థాన్ లోని ఒక టీవీ ఛానల్ తీసిన ఈ యాడ్ వివాదాస్పదంగా మారింది. కాగా ఈ యాడ్‌పై సోషల్ మీడియాలో భారతీయులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యాడ్ ఫిల్మ్ లో భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను హేళన చేస్తూ చూపించడమే భారతీయలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ వీడియో ని పాకిస్థాన్ కి చెందిన జాజ్ టీవీ అనే ఛానల్ వారు రూపొందించారు. ఈ వీడియో 30 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఈ వీడియో సామజిక మాంద్యమాల్లో వైరల్ గా మారింది. ఇందులో కమాండర్ అభినందన్ పోలికలతో ఉన్నవ్యక్తి భారత జట్టు జెర్సీ ధరించి టీ తాగుతూ ఉండగా, ఆ సదరు వ్యక్తిని విచారణాధికారులు ప్రశ్నిస్తున్నట్లు చూపించారు. అయితే చివరగా టీ కప్ ను అభినందన్ పాత్రధారి చేతిలోంచి లాక్కున్నట్లు చూపించి, ఈసారి వరల్డ్ కప్ ని పాకిస్థాన్ లాక్కుంటుందని చూపించారు. ఈ వీడియో ఎంతటి వివాదాలకు దారి తీస్తుందో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు…