విశ్లేషణ: రాజకీయాలలో పవన్ పని ఇక ఐపోయినట్లేనా?

Sunday, December 15th, 2019, 02:37:04 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫై అధికార పార్టీ వైసీపీ నేతలు రోజుకో రకంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న వ్యాఖ్యలు, కార్యక్రమాలు వైసీపీ నేతలకు, ప్రజలకు కూడా హాస్యం తెప్పించేలా వున్నాయి.

తాజాగా పవన్ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్ష లో రైతులు భారీ సంఖ్యలో వచ్చారు. అయితే పవన్ రైతులకోసం వారికీ అండగా పండించిన పంటలకు గిట్టుబాటు ధరని కల్పించాలని ప్రభుత్వం ఫై విమర్శలు చేసారు. అయితే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలు జగన్ పాలనా విధానం తో సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ పవన్ మాత్రం జగన్ చేసిన చిన్న చిన్న తప్పులను వెతుకుతున్నారు.

వున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తో బేదాభిప్రాయాలు రావడం కూడా జనసేన పార్టీ కి నష్టం కలిగించేది చెప్పవచ్చు. స్వయంగా రాపాక వరప్రసాద్ జనసేన పార్టీకి, తనకి బేదాభిప్రాయాలు వచ్చాయి అని తెలిపారు. అంతేకాకుండా రాపాక వరప్రసాద్ జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసారు. అవకాశం దొరికిన కొందరు రాపాక వర ప్రసాద్ తొందర్లో వైసీపీ గూటికి చేరతారని అంటూ విష ప్రచారం చేసారు.

అయితే పవన్ కళ్యాణ్ కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలలో ప్రస్తుతం వున్న ఒకే ఒక్క బలం రాపాక వరప్రసాద్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ రాజోలు నియోజకవర్గం నుండి గెలిచిన రాపాక వరప్రసాద్ వలన జనసేన పార్టీ కి పేరు వుంది. రాపాక తో పవన్ కళ్యాణ్ ఇంకా ఇదే ధోరణి కొనసాగిస్తే అసలుకే మోసం వస్తుందని తెలుస్తుంది.

అయితే జనసేన పార్టీ ఆవిర్భావానికి, జనసేన పార్టీ కి వున్న సిద్ధాంతాలకు అసలు కారణం రాజు రవితేజ. రాష్ట్రంలో జనసేన పార్టీ వెనుక వున్న మేధావి. జనసేన పవన్ కళ్యాణ్ రాజు రవితేజ ని ప్రశంసిస్తూ పార్టీ పెట్టక ముందు నుండే ఎన్నో వ్యాఖ్యలు చేసారు. అలాంటిది జనసేన పార్టీ కి మూలస్తంభం అయిన రవితేజ పవన్ ఫై ఆరోపణలు చేసి పార్టీ ని వీడటం పవన్ కళ్యాణ్ కి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి.

అయితే నీతో ప్రజాబలం తో జగన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ 151 స్థానాల్లో గెలుపొందింది. అయితే కేవలం ఏడూ నెలల పాలనలోనే జగన్ మోహన్ రెడ్డి తన మార్క్ పాలనతో, చంద్రబాబు కంటే మెరుగైన నాయకుడు అని ప్రజలచే అనిపించుకుంటున్నాడు. అయితే ఇపుడు జగన్ తీసుకొచ్చిన దిశ చట్టం ఫై పవన్ ఏ మాత్రం స్పందించలేదు. చంద్రబాబు తీరు తో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నా, పవన్ చంద్రబాబు పై ఏ మాత్రం విమర్శలు గుప్పించడం లేదు.

కేవలం ఏడూ నెలల పాలనకే జగన్ ఎన్నో పనులు చేసారు. ఇంకా చాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే పనుల్లో కూడా వున్నారు. అలాంటి జగన్ ఫై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు సరికావు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే సుగాలి ప్రీతీ హత్య విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు అంతటా హరిచంశనీయంగా మారింది. ఈ విషయాన్నీ ప్రస్తావించకపోతే ర్యాలీ నిర్వహిస్తానని ముందే అన్నారు. అయితే దేశంలోనే ఎంతోమందికి సాధ్యం కానీ చట్టాన్ని తీసుకొచ్చారు జగన్. దిశ చట్టంతో మహిళలకు, చిన్నపిల్లలకు రక్షణ కల్పించేలా. అయేషా మీరా హత్య కేసుని పూర్తిగా విచారణ జరపాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. 12 ఏళ్ల తరువాత అయేషా మీరా మృతదేహానికి పోస్ట్ మార్టం చేయడం కలకలం సృష్టిస్తుంది.

ప్రజల కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, చట్టాలు తెస్తున్న జగన్ ఫై విమర్శలు చేయడం లక్ష్యంగా వున్నపుడు పవన్ కళ్యాణ్ ఇక దేనిమీద పోరాడతారో పవన్ కే తెలియాలి. పవన్ కళ్యాణ్ ఇక పై ఇదే తీరుని కొనసాగిస్తే రాజకీయాలలో పవన్ ఎదగడం కష్టమని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.