పూనమ్ కౌర్ ఫైర్ అయింది ఆ దర్శకుడి మీదేనా?

Friday, May 25th, 2018, 09:50:57 PM IST


నటి పూనమ్ కౌర్ ను ఉద్దేశించి ఇటీవల కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ వివాదంలో భాగాంగా కత్తి మహేష్ పూనమ్, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కలిసి కొన్ని పూజలు చేసారని, అలానే ఆమేకు త్రివిక్రమ్ అంటే ఎందుకంత కోపమని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇష్యూ లోకి నన్ను లాగుతున్నారు, దీనివల్ల నా కెరీర్, నా కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. పవన్ గారు మీరే నన్ను దీనినుండి బయటపడేయాలని అప్పట్లో ఆమె సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసారు. అయితే ఆ తర్వాత పవన్ అభిమానులతో వివాదం సర్దుమనగణంతో, కొన్నాళ్లు సైలెంట్ గా వున్న ఆమె అనూహ్యంగా రెండురోజుల క్రితం ట్విట్టర్ లో పెట్టిన రెండు పోస్ట్ లతో మరొక సంచలనానికి తెరలేపారు. జల్సాలు చూపిస్తూ, అజ్ఞాతంలో ఏసేస్తాడు జాగ్రత్త…నమ్మక ద్రోహి అని ఒక ట్వీట్.

అలానే ఆ దర్శకుడు కేవలం ఎన్ఆర్ఐ హీరోయిన్లకు మాత్రమే దగ్గరగా ఉంటాడని, వాళ్ళు తప్ప ఆయనకి మరొకరు కనపడరని అన్నారు. అంతే కాదు నాకు అవకాశం ఇస్తానని వేరొక ఎన్ ఆర్ ఐ హీరోయిన్ కు అవకాశం ఇచ్చాడని, అదేమిటని ఆరా తీస్తే, తనకు హిట్లు లేవని అన్నట్లు చెప్పింది. మరి ఆ ఎన్ఆర్ ఐ హీరోయిన్ కు మాత్రం ఏమి హిట్లు వున్నాయి. అయినా వారు అయితే మీరు చెప్పినట్లు చేస్తారనేకదా అటువంటి వాళ్ళను తీసుకుంటున్నారు అంటూ సంచలన ట్వీట్లు చేసింది. కాగా ఆమె ట్వీట్ల ద్వారా ఆ దర్శకుడి పేరు చెప్పకనే చెప్పిందని, అయినా ఆమె ఇప్పటికిప్పుడు ఇంత రచ్చ ఎందుకు చేస్తోందో తెలియడంలేదని ఆ డైరెక్టర్ అభిమానులు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆమె చేసిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి…..

  •  
  •  
  •  
  •  

Comments