“డార్లింగ్” ఫ్యాన్స్ “పవర్ స్టార్” ఫ్యాన్స్ యొక్క ట్విట్టర్ రికార్డ్ బద్దలుకొట్టగలరా..?

Monday, October 22nd, 2018, 06:06:26 PM IST

మన భారతదేశ చలన చిత్ర పరిశ్రమలో తమ అభిమాన నటుల యొక్క పుట్టిన రోజు వచ్చిందంటే చాలు వారి యొక్క అభిమానులకు మరియు వారిని ఆరాధించే వారికి ఆ రోజుకి మించిన పెద్ద పండగ మరొకటి ఉండదనే చెప్పాలి.అందులోను మన దక్షిణ భారతదేశంలో అయితే అభిమానం మరింత ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది.అభిమానులు ఒకపక్క బయట తమ అభిమాన నటుని యొక్క పుట్టిన రోజుని ఎంత ఘనంగా చేసుకుంటారో.. సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో ఒక్క రోజు ముందు నుంచే మొదలు పెట్టేస్తారు.అయితే గత కొన్నాళ్లుగా వారి యొక్క అభిమాన నటుల పుట్టిన రోజు వేడుకలను ట్విట్టర్ వేదికగా వారి అభిమానులు చాలా పెద్ద ఎత్తునే జరుపుకుంటున్నారు.

ట్వీట్లు,రీట్వీట్లు తో ఒక 24 గంటలు ట్విట్టర్ లో ప్రపంచ స్థాయి రికార్డులను నెలకొల్పి ట్రెండ్ సెట్ చేస్తారు.ఇప్పుడు ఆ సమయం ప్రభాస్ అభిమానుల దగ్గరకి వచ్చింది.ఇంతకు మునుపు మహేష్ అభిమానులు నెలకొల్పినటువంటి 4.5 మిలియన్ల ట్వీట్ల రికార్డును పవన్ అభిమానులు 7.4 మిలియన్ ట్వీట్ల భారీ మార్జిన్ తో అధిగమించి సరికొత్త రికార్డును నెలకొల్పారు.ఇప్పటికే ఇతర తారల అభిమానులు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కు వారి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇప్పుడు ఈ రికార్డును డార్లింగ్ అభిమానులు బద్దలు కొడతారా కొట్టరా అన్నది ప్రశ్న.టార్గెట్ పెద్దగా ఉన్నా సరే డార్లింగ్ కు కూడా అపారమైన ఆదరణ ఉంది.ఇప్పటికే అభిమానులు కూడా ఈ రోజు సాయంత్రం కోసం ఎదురు చూస్తున్నారు.ఈ సారి ఎలా అయినా పవన్ అభిమానుల పేరిట ఉన్న రికార్డును తమ పేరిట మార్చుకోవాలని చూస్తున్నారు.ఈ తరుణంలో రేపు సాయంత్రం వరకు వేచి చూస్తే వారు పవన్ అభిమానుల రికార్డును బద్దలకొట్టగలరా లేదా తెలిసిపోతుంది.

  •  
  •  
  •  
  •  

Comments