హాలీవుడ్ కోసం బాలీవుడ్ ఆఫర్ వదులుకున్న ప్రియాంక?

Friday, July 27th, 2018, 11:45:18 AM IST

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం బాలీవుడ్ పై కంటే, హాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనపడుతోంది. ఆమె ఇటీవల బే వాచ్ చిత్రం అలానే ఒక వెబ్ సిరీస్ లోను నటించారు. అప్పటినుండి ఆమె హాలీవుడ్ సినిమాలపైనే ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్నారు అనేది బాలీవడ్ వర్గాల వాదన. అంతేకాక ఆమె హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ తో కొన్నాళ్ల నుండి సాగిస్తున్న ప్రేమాయణంకు సంబంధించి ఇటీవల కొన్ని పుకార్లు కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆమె ఒక అద్భుత బాలీవుడ్ ఆఫర్ ని కూడా వదులుకున్నట్లు సమాచారం అందుతోంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘భారత్’ చిత్రంలో ఆమెను ఎంచుకున్న చిత్రం యూనిట్ ఇప్పటికే ఆమెకు రూ.6 కోట్లు ముట్టచెప్పిందని,

వచ్చేనెల 10న ఈ చిత్ర షూటింగ్ లో ఆమె పాల్గొనవలసి ఉండగా, హఠాత్తుగా ఆమె సినిమానుండి తప్పుకున్నరనేది ప్రస్తుత వార్త. అనుకోకుండా ఆమెకు ఒక హాలీవుడ్ సినిమాలో ఆఫర్ రావడం వల్లనే ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లు కొన్ని వర్గాలు అంటున్నాయి. సల్మాన్ ఖాన్ ఇందులో మోటార్ సైకిల్ స్టంట్ మాన్ గా నటిస్తున్నారు, దిశా పాటని మరొక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో షికారు చేస్తున్న ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే ఆ చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడేవరకు వేచి చూడవలసిందే. కాగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే రంజాన్ కు ప్రేక్షకుల ముందుకు రానుంది…..

  •  
  •  
  •  
  •  

Comments