రాజ్ తరుణ్ కెరీర్ ముగిసినట్లేనా?

Monday, June 4th, 2018, 02:13:28 PM IST

హీరోగా ఉయ్యాల జంపాల చిత్రంతో టాలీవుడ్ లోకి పరిచయమైన నటుడు రాజ్ తరుణ్. తొలి చిత్రమే అన్నపూర్ణ స్టూడియోస్ వంటి పెద్ద బ్యానర్ లో చేయడం. అదీ కాక ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో రాజ్ తరుణ్ కి తరువాత మంచి అవకాశాలే దక్కాయి. ఆ తరువాత వచ్చిన సినిమా చూపిస్త మామ చిత్రం కూడా మంచి హిట్ సాధించడంతో ఇండస్ట్రీలో హీరోగా నిలబడ్డాడు. ఇక ఆ తరువాత సుకుమార్ కథ అందించిన కుమారి 21ఎఫ్ కూడా హిట్ కావడంతో రాజ్ తరుణ్ బాగా బిజీ అయ్యారు. అయితే అక్కడి నుండి అయన నటించిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రం మొదలుకొని ఇటీవల విడుదలయిన ‘రాజుగాడు’ వరకు ఒక్క ‘ఈడోరకం ఆడోరకం’ మినహాయించి ఏ ఒక్క చిత్రమ్ కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయితే ఈడోరకం ఆడోరకం చిత్రం అబొవ్ యావరేజ్ గా నిలిచింది.

ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్ చేతిలో రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయని, రానున్న రోజుల్లో ఆయన తనను తాను నిరూపించుకోకపోతే కెరీర్ చాలా వరకు ముగిసిపోయినట్లేనని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఆయన అంగీకరించిన చిత్రాలతో పాటు ఇటీవల తమిళంలో విజయం సాధించిన నానుమ్ రౌడీ తాన్ చిత్రం రీమేక్ కూడా ఒకటి అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సి కళ్యాణ్ తన బ్యానర్ పై నిర్మించనున్నారని, అయితే ఆయనే ఈ చిత్ర డబ్బింగ్ వర్షన్ విడుదల చేసి అది పెద్దగా ఆడకపోవడంతో ప్రస్తుతం రీమేక్ చేయాలనే ఆలోచనతో ఉన్నారట. తమిళ్ లో నటించిన విజయ్ సేతుపతి పాత్రకు రాజ్ తరుణ్ ని ఎంపిక చేశారట. దీనికి సంబందించి అధికారిక ప్రకటన వెలువడవలసి వుంది. కాగా రాజ్ తరుణ్ నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్, మజ్ను, బెలూన్ చిత్రాల్లో అతిథి పాత్రల్లో నటించారు…..

  •  
  •  
  •  
  •  

Comments