ఎన్టీఆర్ బయోపిక్ లో రానా ?

Thursday, April 5th, 2018, 03:02:16 PM IST

నందమూరి బాల కృష్ణ హీరోగా తేజ దర్శకత్వం లో ఇటీవల అంగరంగవైభవంగా ముహూర్తం జరుపుకున్న సినిమా ఎన్టీఆర్. దివంగత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ముహూర్తం ముహూర్తం జరిగిన రోజునుండి మంచి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఈ సినిమాలో నిర్మాణబాధ్యతలు కూడా తీసుకుంటున్న బాలకృష్ణ సినిమాలోని ఇతర తారాగణం ఎంపికపపై ఆచి తూచి వ్యవహరిస్తున్నారట.

అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రను, మన భల్లాలదేవ అయిన రానా కు దక్కినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయమై ఇప్పటికే ఎన్టీఆర్ సినిమా టీం రానా ను సంప్రదించగా ఆ పాత్ర చేయడానికి ఆయన ఓకే చెప్పారని అంటున్నారు. అయితే ఈ విషయమై సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడవలసి వుంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది….

  •  
  •  
  •  
  •  

Comments