సాయిపల్లవి, రాశి ఖన్నాలలో ఎవరి జడ్జిమెంట్ కరెక్ట్?

Tuesday, July 24th, 2018, 11:42:47 PM IST


మన పెద్ద వాళ్ళు చెప్పినట్లు ఎవరికైన ఏదైనా దక్కాలి అంటే ముందుగా మనకు రాత రాసిపెట్టి ఉండాలి అని అంటారు. అది చెడైనా సరే మంచి అయినా సరే. ఏది ఎవరికి దక్కాలని రాసివుంటే వారికీ మాత్రమే దక్కుతుంది. ఇక విషయానికి వస్తే, ఫిదా చిత్రంతో అద్భుతవ విజయాన్ని అందుకుని, తొలి చిత్రంతోనే టోటల్ టాలీవుడ్ చూపును తనవైపుకు తిప్పుకునేలా చేసుకున్న భామ సాయి పల్లవి. ఆ తరువాత ఆమె నాని సరసన నటించిన ఎమ్సిఏ కూడా మంచి విజయం సాధించడంతో ఈ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. అయితే ఏ చిత్రం పడితే ఆ చిత్రం అంగీకరించకుండా సాయి పల్లవి మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ హీరోగా, సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు రూపొందిస్తున్న శ్రీనివాస కళ్యాణం చిత్రంలో మొదట హీరోయిన్ గా అనుకున్నది సాయి పల్లవినేనట. అయితే చిత్ర కథ విన్న ఆమె, సినిమాలో హీరోయిన్ పాత్రకి కి సరైన ప్రాధాన్యత లేనందువల్ల ఆ చిత్రంలో నేను నటించలేను అని చెప్పేసిందట.

కాగా ఆ తరువాత ఆ అవకాశాన్ని రాశి కన్నా దక్కించుకుంది. కానీ ఈ సినిమాలో తన క్యారెక్టర్ విషయమై ఇటీవల మీడియాతో మాట్లాడిన రాశి ఖన్నా, తనకు ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమని, ఈ సినిమా కథని మా ఇంట్లో వాళ్ళు విన్నపుడు ఎంతో ఉద్వేగానికి గురై, నిజంగా ఈ చిత్రంలో నటించే అవకాశం నీకు రావడం చాలా గొప్పవిషయమని మెచ్చుకున్నారట. మరి అంత మంచి స్కోప్ వున్న పాత్ర అయితే సాయి పల్లవి ఎందుకు రిజెక్ట్ చేసిందో అని, అదీ కాకా ఫిదా, ఎమ్సీఏ వంటి సూపర్ హిట్ సినిమాలు తనకు అందించిన దిల్ రాజు బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని ఆమె అసలు ఎందుకు వదిలేసుకుందో, ఇంతకీ ఈ ఇద్దరు హీరోయిన్లలో ఎవరిది నిజమో తెలియాలంటే ఈ చిత్ర విడుదల తేదీ అయిన వచ్చేనెల 9 వరకు ఆగవలసిందే మరి…

  •  
  •  
  •  
  •  

Comments