పిక్ టాక్‌ : సామ్ అచ్చం `ఆజ్ఞాత‌వాసి`లా క‌నిపిస్తోందే?!

Saturday, December 2nd, 2017, 06:07:46 PM IST

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన `ఆజ్ఞాత‌వాసి` పోస్ట‌ర్‌ ఎంత ఆస‌క్తి రేకెత్తించిందో.. ఇదిగో ఇక్క‌డ స‌మంత ఉన్న ఈ పోస్ట‌ర్ అంతే క్యూరియాసిటీ రెయిజ్ చేస్తోంది. సామ్ ఈ పోస్ట‌ర్‌లో ఆజ్ఞాత‌వాసిలా క‌నిపిస్తోంది. అచ్చం ప‌వ‌న్ స్టైల్‌, మ్యాన‌రిజ‌మ్‌ని ఇమ్మిటేట్ చేస్తోందా? అనిపిస్తోంది. ఓమారు ఈ ఛాయాచిత్రాన్ని త‌ర‌చి చూస్తే, అసలు సంగ‌తి అర్థ‌మ‌వుతుంది.

చుట్టూ దూరంగా కొండ‌లు.. కోన‌లు.. ప‌రిస‌రాల్లో ప‌చ్చ‌ద‌నం.. బీడు భూములు.. పొలాలు.. ఆ ప‌క్క‌నే రోడ్‌పై ఎటో ప‌య‌న‌మైన బాట‌సారిలా సామ్ అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మైంది. అదేదో ఓ కొత్త లోకంలా క‌నిపిస్తోంది. ఇక సామ్ డ్రెస్సింగ్ స్టైల్‌ని చూసినా ఆస‌క్తి రెయిజ్ అవుతోంది. బ్లూ డెనిమ్ జీన్స్‌, ఆ పైన వైట్ ష‌ర్ట్‌, దానిపై కాంబినేష‌న్ డెనిమ్‌ జీన్స్ టాప్‌.. మెడ‌లో త‌గిలించుకున్న లెద‌ర్ బ్యాగ్.. చూస్తుంటే లేడీ ఆజ్ఞాత‌వాసిలా క‌నిపంచ‌డం లేదూ? అస‌లింత‌కీ ఈ స్టిల్ ఏ చిత్రంలోనిది? అంటే.. శివ‌కార్తికేయ‌న్ న‌టిస్తున్న 12వ సినిమాలో సామ్ ఇలా కొత్త లుక్‌లో క‌నిపించ‌బోతోంది. తేన్ కాశీ ప‌రిస‌రాల్లో ప్ర‌స్తుతం ఎస్‌కె 12 షూటింగ్ జ‌రుగుతోంది.. స్పాట్ నుంచి వ‌చ్చ‌న ఫోటోని ప్ర‌ముఖ త‌మిళ క్రిటిక్ సామాజిక మాధ్య‌మంలో షేర్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments